Advertisement
Google Ads BL

స్లిప్పర్స్ వేసుకోవడం పై విజయ్ క్లారిటీ


విజయ్ దేవరకొండ సినిమాలతోనే కాదు.. రౌడీ బ్రాండ్స్ తోనూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. రౌడీ బ్రాండ్ దుస్తులతో, విజయ్ దేవరకొండ స్టయిల్ కి ఫాన్స్ ఫిదా. అందుకే చాలా తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండ కి రౌడీ ఫాన్స్ ఏర్పడ్డారు. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ కి ప్రాధాన్యత నిచ్చే విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ లో మాత్రం స్టైలిష్ డ్రెస్సులతో అందరి చూపు తన మీద ఉండేలా చూసుకుంటున్నాడు. కానీ కాళ్ళకి ధరించిన చెప్పుల విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ సింపుల్ గా కనిపిస్తున్నాడు. ఏ స్టైలిష్ షూసో, లేదంటే, మోడ్రెన్ చెప్పులో కాకుండా కేవలం స్లిప్పర్స్ తో లైగర్ ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ లాంచ్ దగ్గర నుండి విజయ్ ఇదే మాదిరి కనిపిస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ విషయమై జనాలు రకరాలుగా స్పందిస్తున్నారు. కొందరు విజయ్ దేవరకొండ సింప్లిసిటీ సూపర్ అంటుంటే.. కొందరు కావాలనే పబ్లిసిటీ కోసం విజయ్ ఇలా చేస్తున్నారు అంటున్నారు. కానీ విజయ్ మాత్రం నాకు ఏ టైం లో ఏం నచ్చుతుందో తెలియదు. బ్రాండ్ తో సంబంధం లేకుండా అన్ని రకాల వస్తువులని ఇష్టపడతాను. అంతేకాదు.. లైగర్ సినిమా రిలీజ్ కి ఎక్కువ టైం లేదు. రోజుకో డ్రెస్, దానికి మ్యాచింగ్ షూస్ వెతకాలంటే చాలా టైం పడుతుంది. అందుకే చెప్పులు కొన్నాను. దానితో నేను రెడీ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. చెప్పులు వేసుకుని ఇలా వెళితే ఎవరన్నా ఏమనుకుంటారో అని నేను ఆలోచించను. నాకు ఏం చెయ్యాలనిపిస్తే అది చేస్తాను, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను అంటూ తన సింప్లిసిటీని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ.

👉 Read : లైగర్ కి కళ్లు చెదిరే ఓపెనింగ్స్ ఖాయం.!

 

Vijay Devarakonda being such a big star and why he wears slippers with stylish clothes:

Do You Know Why Vijay Deverakonda Wore Chappals For Liger Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs