Advertisement
Google Ads BL

పోకిరి, జల్సా.. ఇదేం గోలయ్యా


సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా మహేష్ ఫాన్స్ పోకిరి స్పెషల్ షోస్ మ్యానియాతో ఊగిపోతున్నారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా నిన్న ఆగస్టు 9 న మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన పోకిరి స్పెషల్ షోస్ వేసి మహేష్ ఫాన్స్ కి కిక్ ఇచ్చారు, పోకిరి రిలీజ్ అయిన ప్రతి థియేటర్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డు లతో కళకళలాడాయి. దానితో మహేష్ ఫాన్స్ రెచ్చిపోయి పోకిరి హాష్ టాగ్ ట్రెండ్ చేసారు. కేవలం నిన్న మాత్రమే కాదు, గత పది రోజులుగా మహేష్ ఫాన్స్ అదే పనిగా పోకిరి హాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంచారు.

Advertisement
CJ Advs

మరి మహేష్ ఫాన్స్ అంత రచ్చ చేస్తే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఊరుకుంటారా.. అస్సలూరుకోరు. పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం కూడా స్పెషల్ షోస్ వేయాలంటూ పెద్ద ఎత్తున జల్సా హాష్ టాగ్ తో పాటుగా #Jalsa4K #SanjaySahuArrivingSoon హాష్ టాగ్స్ తో రచ్చకి తెరలేపారు. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా స్పెషల్ షోస్ ప్లాన్ చెయ్యాలంటూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి జల్సా కూడా స్పెషల్ షోస్ ఏమైనా వేసి పవన్ ఫాన్స్ ని కూల్ చేస్తారేమో చూడాలి.  

👉 Read : Massive 200+ Special Shows For Pokiri Across The World

Pokiri, Jalsa hashtags trends in twitter :

Pokiri, Jalsa hashtags trending in twitter 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs