నాగ చైతన్య - రామ్ పోతినేని బాక్సాఫీసు దగ్గర వార్ కి దిగకపోయినా.. ఇప్పుడు ఓటిటి విషయంలో పోటీ పడుతున్నారు. గత నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ ద వారియర్, నాగ చైతన్య థాంక్యూ మూవీస్ థియేటర్స్ లో ఆశించిన ఫలితాలు అందివ్వలేదు, దానితో మేకర్స్ లాస్ అయ్యారు. అందుకే రెండు సినిమాలను ఎర్లీ ప్రీమియర్స్ అంటూ ఓటిటిలో వదులుతున్నారు. జులై 14 న విడుదలైన వారియర్ మూవీ ఆగష్టు 11 న హాట్ స్టార్ లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించడమే కాదు, అందుకు సంబందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.
అంటే ఓటిటి లో ఎన్నిరోజులకి వస్తుంది. ఓటిటి ట్రైలర్ ఇలా అన్నమాట. ఇక నాగ చైతన్య థాంక్యూ మూవీ జులై 22 విడుదలైంది. ఆ సినిమా చైతు కి, దిల్ రాజుకి హోల్సేల్ షాకిచ్చింది. దానితో దిల్ రాజు థాంక్యూ మూవీ ని కేవలం 20 రోజుల్లోనే ఓటిటి నుండి రిలీజ్ కి రంగం సిద్ధం చేసారు. చైతు థాంక్యూ కూడా ఆగష్టు 11 న అమెజాన్ ప్రైమ్ లో రాబోతుంది. అంటే బాక్సాఫీసు వార్ లేకపోయినా.. రామ్ అండ్ చైతు లు ఓటిటి వార్ లో తలపడబోతున్నారు.