ఈ రోజు ఆగష్టు 9 సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. మహేష్ బాబు బర్త్ డే కోసం మహేష్ బాబు ఫాన్స్ సంవత్సరం పొడుగూతా వెయిట్ చేస్తూనే ఉంటారు. మహేష్ కొత్త సినిమాల నుండి పోస్టర్స్ కానీ, అప్ డేట్స్ కానీ వస్తాయని వాళ్ళ ఆశ. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకి స్వీట్ గా విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరు అయితే.. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు
మహేష్ బాబు.
ఆ భగవంతుడు అతనికి మరింత
శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻
Wishing
@urstrulyMahesh
a happy birthday. 💐🎂 అంటూ విషెస్ తెలియజేసారు.
ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ తో చెయ్యాల్సిన SSMB28 నుండి అదిరిపోయే సర్ ప్రైజ్ ఏమైనా వస్తుంది అనుకుంటే.. మేకర్స్ మాత్రం షూటింగ్ మొదలు పెట్టకుండా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేము అంటూ మహేష్ బాబు ఫోటో షేర్ చేస్తూ SSMB28 నుండి ఆయనకి సింపుల్ గా బర్త్ డే విషెస్ తో సరిపెట్టేసారు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ మహేష్ కి సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.