టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ స్టార్ట్ ఈ రోజుకి వారం పూర్తయ్యింది. ఆగష్టు 1 సోమవారం నుండి టాలీవుడ్ లో ఉన్న సమస్యల కారణంగా నిర్మాతలు సినిమా షూటింగ్స్ ఆపేసారు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. చిన్న హీరోలు ఇలా అంతా కామ్ గా ఎదురు చూస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం రోజూ మీటింగ్స్ పెడుతూ సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ ప్రోగ్రెస్ ఉండి.. షూటింగ్స్ మొదలయ్యే సూచనలే కనిపించడం లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా, మల్టీప్లెక్స్ ప్రతినిధులు, సినీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపింది.
ఇప్పటికే మల్టిప్లెక్స్ ల్లో తినుబండారాల ఖర్చు విషయం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే హీరోల రెమ్యునరేషన్ విషయం తెగలేదు. నిర్మాతలు అలా చర్చలు అంటూ కాలయాపన చెయ్యడంతో.. సినిమా షూటింగ్స్ అన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పాన్ ఇండియా మూవీస్ నుండి, చిన్న చితక అన్ని సినిమాల షూటింగ్స్ బంద్ నడవడంతో కార్మికులు ఖాళీగా కనబడుతున్నారు. హీరోయిన్ రిలాక్స్ అవుతున్నారు. కానీ మొదలు కాబోయే కొత్త సినిమాల షూటింగ్స్ కూడా ఆగేసరికి ఫాన్స్ లో కలవరం. ఈ బంద్ ఎప్పటికి ముగిసేనో.. ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అయ్యెనో.. అని ఎదురు చూస్తున్నారు.
👉 Read : మన నక్షత్రాల నత్త నడక - PR పంచ్