ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మేనియాలో వరుసగా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వెలిగిపోతుంటే.. ఆయన భార్య స్నేహ కూడా ఆయనకి ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరోగా బన్నీ.. రెండు వైపులా సంపాదిస్తూ.. క్రేజ్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటే.. ఆయన భార్య స్నేహ సోషల్ మీడియాలో స్టైలిష్ లుక్స్‌తో హీరోయిన్లకు సైతం షాకిస్తుంది. తాజాగా స్నేహ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో ఓ స్టైలిష్ పిక్‌ని పోస్ట్ చేసింది. ఈ పిక్ చూసిన వారంతా.. ఆమె ముందు టాప్ హీరోయిన్లు సైతం దిగదుడుపే అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారంటే.. ఆమె ఈ లుక్‌లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: 3 డేస్‌లోనే కళ్యాణ్ రామ్‌కి లాభాలు
బ్లాక్ డ్రస్‌లో, ట్రెండీ ఫోజులో.. ఈ పిక్‌లో ఉన్న అల్లు స్నేహ రెడ్డి.. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలకు కారణమవుతుంది. ఈ పిక్ ఇప్పటికే 3 లక్షల లైక్స్‌ని సాధించడం విశేషం. అలాగే ఇన్‌స్టాగ్రమ్‌లో అధిక ఫాలోయర్స్ ఉన్న సెలబ్రిటీ భార్యగా కూడా అల్లు స్నేహ అగ్రస్థానంలో కొనసాగుతుంది. అందుక్కారణం.. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో ఆమె తన పిక్స్‌ని షేర్ చేయడమే. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఈ పిక్‌పై సెలబ్రిటీలు సైతం ‘వావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా డాటర్లు కూడా ఈ పిక్‌పై అద్భుతం అనేలా రియాక్ట్ అయ్యారు. ఏదైతేనేం, బ్రాండ్ అంబాసిడర్‌గా బన్నీ.. సోషల్ మీడియా సెన్సేషన్‌గా స్నేహ.. ఇద్దరూ తగ్గేదే లే అన్నట్లుగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారన్నది మాత్రం నిజం.
👉 Read : Allu Arjun wife Sneha reveals the secret long drive