ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సీతారామం హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మహానటి తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కదిలించిన దుల్కర్ సీతారామం లో పెరఫార్మెన్స్ తో అభిమానుల ని పెంచుకున్నాడు. మల్టిప్లెక్స్ థియేటర్స్ లో దుల్కర్ ఎంట్రీ చూసిన ప్రేక్షకులు విజిల్స్ వేస్తుంటే.. ఓ ఎన్టీఆర్, ఓ మహేష్ బాబు, ఓ ప్రభాస్, ఓ అల్లు అర్జున్, రామ్ చరన్, పవన్ కళ్యాణ్ గుర్తుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వారి ఫాన్స్ చేసే రచ్చ అందరికి తెలుసు. అలాంటిది దుల్కర్ ని చూసిన వారు థియేటర్స్ లో ఆగకుండా విజిల్స్ వెయ్యడం ఆయన నటనకు ఎంతమంది ఫాన్స్ ఉన్నారో అర్ధమవుతుంది.
అయితే దుల్కర్ తన ఫ్రెండ్, రిలేటివ్ అయిన నజ్రియా భర్త ఫహద్ ఫాసిల్ బర్త్ డే సందర్భంగా ఫహద్ కి విషెస్ తెలియజేసాడు. అది కూడా ఫహద్ ఫాసిల్ తో నజ్రియా, దుల్కర్, ఆయన భార్య కలిసి సెల్ఫీ తీసుకున్న పిక్ పోస్ట్ చేస్తూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను షానూ !! మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించండి. మీకు మరియు నాచుకు శుభం కలగాలి, మీరు కలలుగన్న ప్రతిదానిని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అంటూ దుల్కర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.