ఆగస్ట్ 1 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదంటూ.. ఖర్చులు భారీగా పెరిగిపోయాయంటూ.. ఇండస్ట్రీలోని అన్ని క్రాఫ్టులతో చర్చించి.. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంగా.. నిర్మాతలు షూటింగ్స్ నిలిపేసినట్లుగా ప్రస్తుతం నిర్మాతలు చెబుతున్నారు. ఫిల్మ్ చాంబర్ సమక్షంలో ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే.. వారం గడిచినా కూడా ఈ విషయంలో సరైన క్లారిటీ లేకపోవడం, చర్చలు అంటూ నిర్మాతలు కాలయాపన చేస్తుండటంతో.. ఇండస్ట్రీలోని ‘టాప్ హీరో’లు సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. తమ చిత్రాల కోసం ఇచ్చిన డేట్స్, ప్లానింగ్ అంతా తారుమారు అయ్యే పరిస్థితులు సంభవించడంతో.. వెంటనే బంద్ ఆపేసి, షూటింగ్స్ ప్రారంభించాలని వారు అల్టిమేటం జారీ చేసినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: కావాలనే ‘మాజీ’ని కెలుకుతున్నాడా?
వాస్తవానికి కాస్ట్ కంట్రోల్ అనేది నిర్మాతల చేతుల్లోనే ఉంటుంది. వారి స్వయంకృతాపరాధం కారణంగానే ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితులు దాపురించాయి. హీరోలు డేట్స్ ఇస్తే చాలు.. ఇతర ఇండస్ట్రీలలోని హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు అయితేనే.. అన్నట్లుగా నిర్మాతల వ్యవహారం ఉండబట్టే, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితులు దాపురించాయని.. కోట శ్రీనివాసరావు వంటి పెద్దలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. అయినా కూడా నిర్మాతలు వారి దారి మార్చుకోలేదు. ఇప్పుడు ఓటీటీలంటూ సాకు చూపిస్తూ.. ఇండస్ట్రీని ప్రక్షాళన చేస్తున్నామని, షూటింగ్స్ ఆపేసుకుని కూర్చున్నారు తప్ప.. మళ్లీ ఇండస్ట్రీలో మాములు పరిస్థితులే ఉంటాయనేది సినీ విమర్శకుల అభిప్రాయం.
ఇది కూడా చదవండి: BP వద్దు.. AP కావాలి - PR పంచ్
అందుకే.. ఈ చర్చలు వల్ల ఒరిగేది ఏమీ ఉండదు.. కాలయాపన తప్ప. ఇండస్ట్రీలోని కార్మికులను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని భావించిన కొందరు స్టార్ హీరోలు.. వెంటనే సినిమాలు షూటింగ్స్ మొదలు పెట్టాలని.. వారి నిర్మాతలకు గట్టిగా చెప్పారట. స్వయంగా హీరోలు కలుగజేసుకోవడంతో.. నిర్మాతలు కూడా వెనక్కి తగ్గేందుకే ఆలోచనలు చేస్తున్నారనేలా ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.