Advertisement
Google Ads BL

ప్రభాస్, పవన్ సినిమాలు అలా మిస్ అయ్యా


ఢీ డాన్స్ షో తో పాపులర్ అయ్యి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోలతో డాన్స్ చేపిస్తున్న శేఖర్ మాస్టర్ బుల్లితెర మీద కూడా హీరోనే. ఢీ డాన్స్ షోకే చాలా రోజులు జెడ్జ్ గా ఎంటర్టైన్ చేసిన శేఖర్ మాస్టర్ అప్పుడప్పుడు జబర్దస్త్ షో కి జెడ్జ్ గా వచ్చేసారు. అంతేకాకుండా ఈటీవీ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లో అదరగొట్టే శేఖర్ ఇప్పుడు ఈటీవి కి దూరంగా ఉంటున్నారు. స్టార్ మా లో కామెడీ స్టార్స్ కి జెడ్జ్ గా కొన్నాళ్ళు పనిచేసిన శేఖర్.. మహేష్ బాబు దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరితో వర్క్ చేసాడు.

Advertisement
CJ Advs

కానీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మాత్రం శేఖర్ మాస్టర్ స్టెప్స్ వేయించలేకపోయాడు. అయితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో తాను వర్క్ చెయ్యలేకపోవడానికి కారణాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారితో పని చేయకపోవడానికి బలమైన కారణాలేమీ లేవు. నాకు ఓ సమయంలో వారిద్ద‌రితోనూ వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. కానీ మిస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లోని ఓ సాంగ్ కి నాకు పని చేసే అవకాశం వచ్చింది. నేను డైరెక్టర్ శరత్ గారిని కలిసాను, మా మధ్యన చర్చలు అయ్యాయి. ఆ సాంగ్ షూట్ చెయ్యాల్సిన టైం లో మెయిన్ టెక్నీషియన్ కి ఫీవర్ రావడంతో అది లేట్ అయ్యింది. ఆ తర్వాత నేను వేరే సినిమా షూట్ లో బిజీగా ఉండడంతో ఆ అవకాశం పోయింది.

ప్ర‌భాస్ - కొరటాల కాంబోలో వచ్చిన మిర్చికి కొరియోగ్రాఫ‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చింది. అప్పుడు వెళ్లి సెట్స్‌లో ప్ర‌భాస్‌ గారిని క‌లిశాను. ప్రభాస్ గారు కొర‌టాల శివ‌ గారికి క‌లిపించారు. నేను అప్పుడే కొరియోగ్రాఫ‌ర్‌గా ఎదుగుతున్నాను. అందువ‌ల్ల కొర‌టాల శివ‌గారు నాతో వర్క్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించ‌లేదపించింది. త‌ర్వాత బాహుబ‌లితో ప్రభాస్ బిజీ అయ్యారు. తర్వాత కూడా ప్రభాస్ వరస సినిమాల్తో బిజీ అయ్యారు. అందుకే నేను ఆయనతో చెయ్యలేకపోయాను.. అంటూ చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్.  

Shekhar Master not working with the Prabhas and Pawan Kalyan:

Sekhar Master About Movie With Prabhas, Pawan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs