Advertisement
Google Ads BL

బింబిసార టీం కి అల్లు అర్జున్ బూస్ట్


నిన్న శుక్రవారం రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ బింబిసార కి పాజిటివ్ రివ్యూస్ మాత్రమే కాదు, కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ రావడం అటు ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇస్తే.. ఇటు కళ్యాణ్ రామ్ కడుపు నింపేసింది. బింబిసార హిట్ ఇండస్ట్రీ హిట్ అంటూ కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా ఫాన్స్ కి లేఖ కూడా రాసాడు. అయితే కొన్ని రోజులుగా డల్ గా వున్న బాక్సాఫీసుకి ఊపు తీసుకునివచ్చిన బింబిసార, సీతారామం మూవీస్ ని పొగిడేస్తూ ఇండస్ట్రీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. చిరు దగ్గర నుండి నిఖిల్, రామ్ వరకు కళ్యాణ్ రామ్ బింబిసారా టీం ని, దుల్కర్, సీతారామం టీం ని పొగుడుతూ ట్వీట్స్ చేస్తుంటే.. ఆడియన్స్ మౌత్ టాక్ సినిమాల కలెక్షన్స్ కళకళలాడేలా చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార టీం కి స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బూస్ట్ ఇచ్చాడు. బింబిసార మూవీ టీమ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ బింబిసారను బాగా హ్యాండిల్ చేసావ్ అంటూ వశిష్ట ని స్పెషల్ గా అభినందించిన అల్లు అర్జున్.. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా ఎఫెక్టివ్‌గా ఉందన్నాడు. సినీ ఇండస్ట్రీకి సరికొత్త సినిమాలు అందిస్తున్న కళ్యాణ్ రామ్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమే అంటూ ట్వీట్ చెయ్యడం అటు నందమూరి ఫాన్స్ కి ఇటు సినిమా లవర్స్ కి ఇంట్రెస్టింగ్ గా మారింది.

👉  అల్లు స్నేహ ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే.!

Allu Arjun congratulates Kalyan Ram on Bimbisara success:

Allu Arjun showers praise on Nandamuri Kalyan Ram Bimbisara success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs