Advertisement
Google Ads BL

హిట్ ని మిస్ చేసుకున్న పూజ హెగ్డే


దువ్వాడ జగన్నాధం సక్సెస్ నుండి టాలీవుడ్ లో ఎదురు లేకుండా పోయింది పూజ హెగ్డే కి . ఏ సినిమా చూసినా పూజ హెగ్డే నే హీరోయిన్ అన్నట్టుగా మారిపోయింది టాలీవుడ్ లో పరిస్థితి. కానీ పూజ హెగ్డే కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. వరసగా తెలుగులో రెండు ప్లాప్స్, అవి ప్లాప్స్ అనేకన్నా డిజాస్టర్స్ అంటే కరెక్ట్ గా ఉంటుందేమో.. మరొకటి తమిళ్ షాక్. తెలుగులో చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాధే శ్యామ్ పూజ హెగ్డే కి బిగ్ షాక్ ఇవ్వగా.. ఆచార్య అమ్మడుకి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇక తమిళంలో విజయ్ బీస్ట్ కూడా ఆమెకి మాములుగా షాక్ ఇవ్వలేదు. అయితే మూడు ప్లాప్స్ ఉన్నప్పటికీ పూజ హెగ్డే కి ఆఫర్స్ లో కొరతలేదు. కాకపోతే పూజ హెగ్డే ఈ ఏడాది ఓ హిట్ సినిమాని మిస్ చేసుకుంది. 

Advertisement
CJ Advs

అది గత శుక్రవారం రిలీజ్ అయిన సీతా రామం. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా  సీతారామం మొదలు పెట్టినప్పుడు సీత కేరెక్టర్ కోసం పూజ హెగ్డే నే ఫస్ట్ హీరోయిన్ అనుకున్నారట. పూజ హెగ్డే ని ఫస్ట్ చాయిస్ చేసుకుని ఆమెని సంప్రదించడం జరిగినా.. కోవిడ్ వలన పూజ హెగ్డే అంతకుముందు కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ బిజీ వలన సీతారామం కి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక సీతారామం వదులుకోవడంతో పూజ హెగ్డే ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ని ఎంచుకుంది టీం. దానితో సీతారామం హిట్ పూజ హెగ్డే చేతిలో నుండి జారిపోయింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంజాయ్ చేస్తున్న సీతారామం సక్సెస్ ని పూజ హెగ్డే ఎంజాయ్ చేసేది. పాపం పూజ హెగ్డే ... మూడు ప్లాప్స్ తర్వాత భారీ హిట్ పూజ చేతిలో ఉండేది. కానీ అది మిస్ అయ్యింది.

Click Here For Pooja Hegde Latest Photos

Pooja Hegde First Choice for SitaRamam Movie:

Is Pooja Hegde First Choice For Role Of Sita In Sita Ramam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs