జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మల్లెమాల ఇద్దరు గ్లామర్ యాంకర్స్ తో షో ని నడిపించేవారు. అనసూయ, రష్మీ రెండు పిల్లర్స్ లా జబర్దస్త్ షో కి నిలిచారు. కమెడియన్స్ కామెడీ కి ఎంత క్రేజ్ ఉంటుందో యాంకర్ అందాల విందు ఆ షో కి అంతే హెల్ప్ అయ్యింది. ఇప్పటివరకు జబర్దస్త్ లో అనసూయ గ్లామర్ షో ముందు, ఆమె హోస్టింగ్ ముందు రష్మీ తేలిపోతూనే ఉంది. ఆమె ఇంగ్లీష్ మీడియం కావడంతో తెలుగు పదాలను ఒత్తి ఒత్తి పలకడం రష్మీ కి మైనస్. అనసూయ అనర్గళంగా మట్లాడుతూ హైప్ పెంచేది. కానీ ఇప్పుడు అనసూయ జబర్దస్త్ వదిలేసి పక్క ఛానల్ కి వెళ్ళిపోయింది. అనసూయ ప్లేస్ లో ఏ టాప్ యాంకరో దిగుతుంది అని ఓ వారం రోజులు బుల్లితెర ప్రేక్షకులు చాలా ఆశ పడ్డారు.
కానీ మల్లెమాల కి బడ్జెట్ లేదో.. లేదంటే అనసూయకి మ్యాచ్ అయ్యే యాంకర్ దొరకలేదో.. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మిని జబర్దస్త్ యాంకర్ గా కూర్చోబెట్టగానే బుల్లకితెర ప్రేక్షకులు చాలా డిస్పాయింట్ అయ్యారు. ఇప్పటివరకు శుక్రవారం ఒక్కరోజే రష్మిని భరించేవాళ్ళం. ఇప్పుడు గురువారం కూడానా అంటూ ఫీలవుతున్నారు. గ్లామర్ విషయంలో వంక పెట్టడానికి లేకపోయినా.. వ్యాఖ్యాతగా రష్మీ మాత్రం కాస్త డల్ అనే చెప్పాలి. మరి ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలా రెండు రోజులు ఒకటే ఫేస్ చూడాలా.. కొత్త యాంకర్ తీసుకురండి సారూ అంటూ మల్లమాలకి రిక్వెస్ట్ లు పెడుతున్నారు.