Advertisement
Google Ads BL

మరోసారి ప్రేమపై చైతు కామెంట్స్ వైరల్


అక్కినేని నాగ చైతన్య సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల ప్రేమని పెళ్లి బంధంతో ముడి వేసుకున్నాడు. కానీ నాలుగేళ్ళ పెళ్లి బంధాన్ని విడాకులు తీసుకుని విడగొట్టేసుకుంది ఈ జంట. విడాకులై ఓ ఏడాది గడుస్తున్నా చైతు - సమంత ల విడాకుల మేటర్ ఇంకా మీడియాలో హాట్ టాపిక్ గానే నడుస్తుంది. అందులో ఈమధ్యన సమంత కరణ్ జోహార్ షో లో విడాకులపై చేసిన కామెంట్స్, చైతు లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్న కామెంట్స్ అవి ఇంకా ఇంకా మీడియాలో సంచలనంగానే నిలుస్తున్నాయి. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో నాగ చైతన్య విడాకుల విషయంపై నోరు విప్పడమే కాదు, సమంత పై ఇంకా గౌరవం ఉంది అని చెప్పాడు.

Advertisement
CJ Advs

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరు ఓసారి ప్రేమించారు. అది పెళ్లి తర్వాత బ్రేకప్ అయ్యింది. మరోసారి ప్రేమించే అవకాశం ఉందా.. అని అడగగా.. దానికి నాగ చైతన్య ఏమో.. ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చు, ప్రేమ పుట్టొచ్చు, ప్రేమ కలగకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ప్రేమ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం జీవించడానికి గాలి ఎంత ముఖ్యమో.. మనిషి జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం ప్రేమించడమే కాదు, ఆ ప్రేమను స్వీకరించాలి కూడా. అప్పుడే మన జీవితం ఆరోగ్యవంతంగా.. అద్భుతంగా సాగుతుంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Naga Chaitanya reacts to finding love again post separation from Samantha:

Is Naga Chaitanya open to finding love again? Here's what the actor has to say!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs