Advertisement
Google Ads BL

కాజల్ క్లారిటీ ఇచ్చిందిగా..


కాజల్ అగర్వాల్ ని మెగాస్టార్ ఆచార్య నుండి తప్పించారు, మరోపక్క భరతీయుడు 2 అసలు ఉంటుందో లేదో అనే టైం లో కాజల్ భర్త గౌతమ్ కిచ్లుతో ముంబై వెళ్ళిపోయింది. తర్వాత కాజల్ పిల్లలు ప్లాన్ చేసుకుంది. కొద్దినెలల క్రితం కాజల్ అగర్వాల్ పండంటి బాబు నీల్ కి జన్మనిచ్చింది. బాబు పుట్టాక కాజల్ అగర్వాల్ సినిమాకి బ్రేక్ తీసుకుంటుంది అని, కాదు ఆమె నటనకు గుడ్ బాయ్ చెప్పెయ్యబోతుంది అనే ప్రచారం జరిగింది. ఆతర్వాత కాజల్ రీ ఎంట్రీ ఇచ్చే విషయమై చర్చలు మొదలయ్యాయి. కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు నడవడానికి డిసైడ్ అయ్యింది అన్నారు. కానీ కాజల్ వైపు స్పందన లేదు.

Advertisement
CJ Advs

అదలా ఉండగా.. కాజల్ ని ఇప్పుడు భారతీయుడు 2 నుండి తప్పించారనే టాక్ నడుస్తుంది. కమల్ హాసన్ - శంకర్ లు త్వరలోనే ఇండియన్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోపులో కాజల్ ప్లేస్ లోకి మరో హీరోయిన్ మేటర్ తెరపైకి వచ్చింది. దానితో కాజల్ అగర్వాల్ లైన్ లోకి వచ్చింది. భారతీయుడు 2 నుండి తనని తీసెయ్యలేదని, తన పాత్ర ఎలా ఉందో అలానే ఉంది అని, సెప్టెంబర్ నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కాజల్ క్లారిటీ వ్వడంతో.. కాజల్ అగర్వాల్ ప్లేస్ లో మరో హీరోయిన్ న్యూస్ పై అభిమానులకి మబ్బులు విడిపోయాయి.

Kajal Agarwal on Indian 2:

Indian 2 for September sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs