శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడానికి కిందా మీదా పడుతుంది. సోషల్ మీడియాలో హాట్ గా రెడీ అయ్యి ఎక్సపోజింగ్ చేసినా.. జాన్వీ కి స్టార్ ఆఫర్స్ దక్కడం లేదు. రీసెంట్ గా విడుదలైన గుడ్ లక్ జెర్రీ కూడా జాన్వీ కి షాకిచ్చింది. అయితే తాజాగా జాన్వీ కపూర్ ముంబై లోని పార్ష్ ఏరియా లో ఉన్న తన ఇంటిని అమ్మేసినట్లుగా తెలుస్తుంది. జూహులోని ఓ అపార్టుమెంట్‌లో ఉన్న తన ప్లాట్‌ను భారీ ధరకు బాలీవుడ్ లోని ఓ నటుడికి అమ్మినట్లుగా తెలుస్తుంది. 2020 లో జూహు-విల్లె పార్లీ అనే అపార్ట్‌మెంట్‌లో గల 14, 15, 16 అంతస్థుల్లో నిర్మించిన ఈ లగ్జరీ ప్లాట్‌ను 35 కోట్లకి జాన్వీ కపూర్ కొనేసింది.
ఇప్పుడు అదే లగ్జరీ ప్లాట్ ని 45 కోట్లకి జాన్వీ కపూర్.. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావు కి అమ్మేసింది అంటున్నారు. పది కోట్ల లాభం వచ్చింది సరే. ఇలా ఉన్నట్టుండి జాన్వీ కపూర్ ఇల్లు అమ్మెయ్యడం పై బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆమె తండ్రి బోని కపూర్, చెల్లి ఖుషి కపూర్ తో కలిసే ఉంటుంది. ఇక ఈ మధ్యనే జాన్వీ సవతి సోదరుడు అర్జున్ కపూర్ కూడా తన ప్లాట్ ని అమ్మేసాడు.