జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో వారానికో జెడ్జ్ మారుతున్నారు. నటి ఇంద్రజ ఒక్కరే కాస్త రెగ్యులర్ గా వస్తున్న జెడ్జ్. మనో కూడా గురువారం జబర్దస్త్ కి జెడ్జ్ గా వస్తున్నారు. ఫ్రైడే మాత్రం ఇంద్రజ పక్కన కొత్త కొత్త జెడ్జ్ లు మారుతున్నారు. రెండు వారాలుగా ఖుష్బూ జబర్దస్త్ కి జెడ్జ్ గా వస్తున్నారు. అయితే రోజా, నాగబాబు పర్మినెంట్ జెడ్జెస్ గా జబర్దస్త్ ని హ్యాండిల్ చేసినా.. నాగబాబు మల్లెమాల పై కోపంతో వెళ్లిపోగా.. రోజా మినిస్టర్ పదవి కోసం వదిలేసింది. ఆ త్తర్వాత జెడ్జ్ స్థానానికి చాలామంది వస్తూ పోతున్నారు. అయితే రెండు వారాలుగా ఖుష్బూ జబర్దస్త్ కి జెడ్జ్ గా రావడమే కాదు.. ఆ ప్లేస్ లో కూర్చుని కామెడీ చేస్తుంది.
అవసరమైతే స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ కూడా చేస్తూ కమెడియన్స్ ని ప్రోత్సహిస్తుంది. అయితే తాజాగా భాస్కర్ స్కిట్ లో పంచ్ లు, భాస్కర్ గెటప్ చూసిన ఖుష్బూ వాళ్ళ స్కిట్ నచ్చి విజిల్ వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఖుష్బూ భాస్కర్ స్కిట్ అవ్వగానే జెడ్జిమెంట్ చెప్పేటప్పుడు లేచి మరీ విజిల్ వేసింది. గతంలో జెడ్జ్ లు ఉన్నారు, వారు జేడ్జ్మెంట్ ఇచ్చారు. కానీ ఇలా ఎప్పుడూ విజిల్ వేసిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు ఖుష్బూ మాత్రం స్కిట్స్ టాప్ లో వెళుతుంటే విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చెయ్యడం అందరిని ఆకర్షించింది.
జబర్దస్త్ : రెండు రోజులూ ఒకటే ఫేస్ [News on 07-08-2022]