Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ప్లాన్ చేంజ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత చెయ్యబోయే సినిమాల విషయంలో కన్ఫ్యూషన్ లో ఉన్నారనే మాట ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేసారు. మొన్నీమధ్యనే ఎన్టీఆర్ బర్త్ డే కి అఫీషియల్ గా కొరటాల వీడియో కూడా రిలీజ్ చేసారు. కానీ కొరటాల ఆచార్య ప్రోబ్లెంస్ లో ఉండడం, ఎన్టీఆర్ ది పాన్ ఇండియా మూవీ కావడంతో మళ్ళీ స్క్రిప్ట్ విషయంలో కొరటాల తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో NTR30 లేట్ అవుతుంది. ఆయనతో సినిమా ఎలాగూ లేట్ అవుతుంది కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడు ప్లాన్ లో చేంజ్ చేశారట.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ కొత్త ప్లాన్ లో భాగంగా బుచ్చిబాబు తో కూడా సినిమా మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యి బుచ్చి బాబుని పిలిచి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చెయ్యడానికి రెండు నెలల టైం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.. అందుకే బుచ్చి బాబు స్టోరీ డెవలెప్మెంట్ కోసం ఈమధ్యన సుకుమార్ తో మీటింగ్ పెట్టాడని, సుకుమార్ స్టోరీ తోనే బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని, కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్పోర్ట్స్ పాలిటిక్స్ కీలక పాత్ర వహిస్తాయని.. అంటున్నారు. అటు కొరటాల ఇటు బుచ్చిబాబు సినిమాలను ఒకేసారి చెయ్యాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. బుచ్చి బాబు కూడా వీలైనంత తొందరగా ఎన్టీఆర్ తో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రాసెస్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Plan change for Young Tiger NTR:

Koratala and Buchi Babu films go simultaneously
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs