Advertisement
Google Ads BL

వైరల్: థియేటర్స్ విషయంలో ప్రభాస్ కామెంట్స్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ డిసాస్టర్ తర్వాత పబ్లిక్ లోకి వచ్చింది లేదు, ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది లేదు. రాధే శ్యామ్ తర్వాత సమ్మర్ వెకేషన్స్ కి వెళ్లొచ్చిన ప్రభాస్ సైలెంట్ గా ప్రాజెక్ట్ కె షూటింగ్, సలార్ మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మధ్యలో ముంబైలో జరిగిన ఆదిపురుష్ ఓం రౌత్ ఇచ్చిన పార్టీలో బరువు తగ్గి లుక్ మార్చిన ప్రభాస్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభాస్ ఓ పబ్లిక్ ఈవెంట్ కి హాజరయ్యారు. అది కూడా వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన సీత రామం ప్రమోషన్స్ కోసం. 

Advertisement
CJ Advs

దుల్కర్ సల్మాన్ - మృణాళిని ఠాకూర్ కలయికలో రష్మిక కీలక పాత్రలో నటించిన సీత రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ ని చూసి ఫాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఫ్రెష్ గా చూసిన ఫీలింగ్ తో ఫాన్స్ సంబరాలు చేసుకుంటుంటే.. ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాల పరిస్థితిపై ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సీతారామం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ..

కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి.. ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లటం మానం కదా. సీత రామం లాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. సీతా రామం సినిమాని థియేటర్ లోనే చూడాలి. మాకు థియేటర్స్ గుడులు లాంటివి. తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడండి.. అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Some movies should be seen in the theater itself: Prabhas:

Theaters are like temples: Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs