Advertisement
Google Ads BL

జగపతి బాబు వల్లే మోసపోయా


సీనియర్ నటుడు జగపతి బాబు పై ఇప్పుడొక నటుడు సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం అందరిలో ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అజాత శత్రువు, కాంట్రవర్సీలకి దూరంగా ఉండే జగపతి బాబుపై ఆ నటుడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆయనెవరో కాదు కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న వేణు తొట్టెంపూడి. గతంలో జగపతి బాబు తో వేణు ఖుషి ఖుషీగా, హనుమాన్ జంక్షన్ సినిమాల్లో నటించాడు. తర్వాత సోలోగా చేసిన సినిమాలేవీ వేణుకి కలిసి రాకపోవడం, ఇతర కారణాల వలన వేణు కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడంలేదు. గతంలో దమ్ము సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి రవితేజ రామారావు ఆన్ డ్యూటీ లో నటించాడు. 

Advertisement
CJ Advs

అయితే రామారావు ప్రమోషన్స్ లో భాగంగా వేణు గతంలో తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను బయటపెట్టాడు. అందులో భాగంగా జగపతి బాబు గారంటే నాకు ఇష్టం, ఆయనతో మంచి అనుబంధం ఉండేది. ఒకసారి తనకు ఎవరో తెలియకపోయినా జగపతి బాబు గారు చెప్పారని ఆ వ్యక్తికి అప్పు ఇచ్చాను అని, కానీ అతను నా డబ్బు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టాడని, తర్వాత జగపతి బాబు గారు కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు అని.. జగపతి బాబు గారు మధ్యలో ఉండి డబ్బు ఇవ్వమంటే ఇచ్చి మోసపోయాను అని, అప్పట్లో 14 లక్షలు అంటే మాటలు కాదు అని, ఆయన ఫోన్ చెయ్యడం కానీ, కలవడం కానీ చెయ్యలేదు, చాలా బాధ వేసింది అని చెప్పుకొచ్చాడు. 

Venu sensational comments on Jagapathi Babu:

Hero Venu Thottempudi said that he lost a lot of money because of Jagapathi Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs