Advertisement
Google Ads BL

మరోసారి కోర్టు మెట్లెక్కిన రానా దగ్గుబాటి


రానా దగ్గుబాటి విరాట పర్వం మూవీ రిలీజ్ తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు. ఇతర సినిమా షూటింగ్స్ లో బిజీగా వున్నప్పటికీ.. రానా ఇప్పుడు ఓ స్థలం విషయంలో తరచూ కోర్టుకి హాజరవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్థలం వివాదం కారణంగా జులై 13 న ఓసారి కోర్టుకి వెళ్లిన రానా మరోసారి హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టుకు హాజరయ్యాడు. హైదరాబాద్ కాస్ట్లీ ఏరియా అయిన ఫిలింనగర్ లో సీనియర్ నటి మాధవి లతకు చెందిన 2200 చదరపు గజాల స్ధలాన్ని హీరో దగ్గుబాటి వెంకటేష్ ఆయన అన్న దగ్గుబాటి సురేష్ అప్పట్లో అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వివాదాస్పదమైన ఈ భూమిని హైదరాబాద్ కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ లీజుకు తీసుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం లీజుకు తీసుకున్న ఆ బిజినెస్ మ్యాన్ లీజు అగ్రిమెంట్‌ 2016, 2018లో కూడా రెన్యువల్‌ చేయించుకున్నారు. 

Advertisement
CJ Advs

కానీ అగ్రిమెంట్ పూర్తికాకుండానే సురేష్ బాబు ఆ భూమిలోని ఓ 1000 గజాలను కొడుకు రానా పేర రిజిస్టేషన్ చెయ్యడంతో.. రానా ఆ భూమిని లీజు కి తీసుకున్న వ్యక్తి తో స్థలం ఖాళీ చెయ్యాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో రానాపై సదరు లీజుదారుడు కోర్టులో కేసు వెయ్యడంతో రానా కి నోటీసు లు ఇచ్చి.. కోర్టుకు హాజరవమనగా.. రానా ఆ కారణంగానే తరచూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. 

Rana attends City civil court :

Rana Daggubati attends City Civil court in land dispute issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs