Advertisement
Google Ads BL

భారీ హిట్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాడు

lokesh kanagaraj,vikram movie,social media | భారీ హిట్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాడు

లోకేష్ కనగరాజ్ ఇప్పుడు స్టార్ హీరోల మనసులని దోచేసిన దర్శకుడు. మాస్ ఆడియన్స్ లేదు క్లాస్ ఆడియన్స్ లేదు.. ప్రతి ఒక్క సినిమా లవర్ లోకేష్ కనగరాజ్ టేకింగ్ గురించి మాట్లాడే వారే. ఖైదీ సినిమాతో తానేమిటో ప్రూవ్ చేసుకోవడం కాదు, తన దగ్గర సరుకు ఎంతుంతో చూపించాడు. అదే కమల్ హాసన్ విక్రమ్ తో తన టాలెంట్ మరింతగా చూపించి శెభాష్ అనిపించుకున్నాడు. కమల్ హాసన్ కి, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కి హోల్సేల్ గా హిట్ అందించిన లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం కొన్నాళ్ల పాటు నేను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నా తదుపరి చిత్రం ప్రకటనతో త్వరలో తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరందరూ జాగ్రత్త పడండి.. ప్రేమతో లోకేశ్ కనగరాజ్.. అంటూ ట్వీట్ చేసాడు. మరి విక్రమ్ తో హిట్ కొట్టి ఇలా విరామం తీసుకోవడం ఫాన్స్ కి నచ్చకపోయినా.. నెస్ట్ ప్రాజెక్ట్ కోసం లోకేష్ పర్ఫెక్ట్ గా రెడీ అవడానికి సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చారని.. లోకేష్ తదుపరి చిత్రం హీరో విజయ్ తో ఉండబోతుంది. ఆ సినిమా ప్రకటనతోనే మళ్ళీ లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇస్తారన్నమాట.   

Lokesh Kanagaraj surprises movie lovers:

Star director Lokesh Kanagaraj  takes a startling decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs