Advertisement
Google Ads BL

ఇండస్ట్రీ బంద్ - హీరోలు సైలెంట్


టాలీవుడ్ లో ఈరోజు సోమవారం నుండి చిన్న, పెద్ద సినిమాల షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. స్టార్ హీరోల సినిమాల దగ్గరనుండి పాన్ ఇండియా మూవీ హీరోల సినిమాల వరకు అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. కాకపోతే నిర్మాత దిల్ రాజు వంశీపైడిపల్లి - విజయ్ కలయికలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ షూటింగ్ చెయ్యడంతో కొంతమంది అభ్యంతరాలు తెలపగా.. నేను తెలుగు సినిమా షూటింగ్ చెయ్యడం లేదు. తమిళ సినిమా విజయ్ షూటింగ్ చేస్తున్నాను అంటూ వివరణ ఇచ్చారు. అయితే షూటింగ్స్ నిలిచిపోయి కొన్ని గంటలు గడుస్తున్నా.. ఇంతవరకు ఏ ఒక్క హీరో కూడా ఈ విషయమై స్పందించడం లేదు. 

Advertisement
CJ Advs

ఇండస్ట్రీలోని ముఖ్య సమస్యల్లో హీరోల రెమ్యునరేషన్ పెద్దగా కనిపిస్తున్న సమస్య. మొన్నీమధ్యనే దిల్ రాజు పెద్ద హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో చర్చలు జరపగా.. వారు పారితోషకాలు తగ్గించుకునేందుకు ఒప్పుకున్నారనే టాక్ నడిచినా.. ప్రస్తుతం ఎలాంటి న్యూస్ ఈ విషయమై వినిపించడం లేదు. మరోపక్క ప్రభాస్ తన సర్జరీ కోసం విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. ఇక మిగిలిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకీ ఇలా స్టార్ హీరోలు ఈ విషయమై నిర్మాతలతో చర్చిస్తే.. ఈ సమస్యలు కాస్త అయినా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. కానీ స్థార్ హీరోలంతా కామ్ గా ఉన్నారు. ఎవరైనా ముందుకు స్టెప్ తీసుకుంటేనే కదా.. సమస్య పరిష్కారం అయ్యేది. 

Industry Bandh - Silent Heroes:

Telugu film producers to stop shoots due to industry problems
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs