Advertisement
Google Ads BL

దసరా సినిమాలపై భారీ ఎఫెక్ట్


దసరా రిలీజ్ అంటూ పెద్ద సినిమాలు దసరా పండగకి కచ్చిఫ్ వేసేసాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ ఇంకా కొన్ని సినిమాలు దసరా టార్గెట్ పెట్టుకుని సినిమా షూటింగ్స్ చేస్తున్నాయి. కానీ దసరా బరిలో నిలవబోయే సినిమాలకి ఇప్పుడొక గండం వెంటాడుతుంది. అదేమిటంటే.. ఈ రోజు ఆగస్టు 1 నుండి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. టాలీవుడ్ సమస్యలను తీర్చేందుకు ప్రస్తుతం కొన్ని రోజులపాటు సినిమా షూటింగ్స్ ఆపాలంటూ నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయించడంతో సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. 

Advertisement
CJ Advs

అందులో పాన్ ఇండియా మూవీస్, బడా బడ్జెట్ మూవీస్, చిన్న సినిమాలు ఇలా ప్రతి ఒక్క షూటింగ్ నిలిచిపోయింది. మరి సంక్రాంతి, సమ్మర్ రిలీజ్ సినిమాల షూటింగ్స్ కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ.. దసరా కి రాబోయే చిత్రాలకు ఇలా షూటింగ్ ఆగడం ఇబ్బందే. దసరా చిత్రాల షూటింగ్స్ అన్నీ చివరి దశలో ఉన్నాయి. అయినప్పటికీ షూటింగ్స్ చెయ్యకూడదనే నిర్ణయంతో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆ ఎఫెక్ట్ దసరా, దీపావళి సినిమాలపై పడుతుంది అంటున్నారు. మరి ఈ షూటింగ్స్ బంద్  ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి. 

Huge effect on Dussehra movies:

Tollywood Shootings Bandh In August 1st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs