రాశి ఖన్నా కి పాపం అసలు టైం అస్సలు కలిసి రావడం లేదు. టాలీవుడ్ లో రాశి ఖన్నా కి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. ఆ ప్లాప్ లు అలాంటి ఇలాంటి వి కాదు. గోపీచంద్ - మారుతి కాంబోలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ తో రాశి ఖన్నా మరోసారి టాలీవుడ్ లో పాగా వేద్దామనుకుంది. అమ్మడు బరువు తగ్గించి గ్లామర్ డోస్ పెంచినా, ఆమె గ్లామర్ పక్కా కమర్షియల్ కి కలిసి రాలేదు. దానితో రాశి ఖన్నా నాగ చైతన్య తో నటించిన థాంక్యూ మూవీ పై పెట్టుకుంది. ఆ సినిమా హిట్ అవుతుంది. ప్లాప్ అయిన మూడ్ లో నుండి బయటపడొచ్చు అనుకుంది.
అక్కడ థాంక్యూ కూడా రాశి ఖన్నా కి షాకిచ్చింది. ఆ సినిమాకి మరీ పూర్ కలెక్షన్స్ రావడంతో థాంక్యూ డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. దానితో రాశి ఖన్నా ని బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు అందుకుంది. అయితే ఇప్పుడు తమిళనాట హిట్ కోసం ఎదురు చూస్తున్నది. అక్కడ రాశి ఖన్నా నటించిన తిరుచిత్రం బలం విడుదలకు సిద్ధం అవుతుంది. ఆ సినిమా ఆడియో లాంచ్ లో పాల్గొన్న రాశి ఖన్నా తన స్టయిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో రాశి ఖన్నా ఎల్లో సారీ లో స్టయిల్ గా నవ్వుతూ కనిపించింది. పాపం పాప నవ్వుతుంది కానీ.. లోపల రెండు ప్లాప్ ల బాధ వుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.