Advertisement
Google Ads BL

బింబిసారా 2 లో ఎన్టీఆర్: క్లారిటీ వచ్చేసింది


కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా ఆగష్టు 5 న విడుదల కాబోతుంది. వశిష్ట దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసారా మూవీ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వంతు సహాయం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఇస్తున్న ఇంటర్వ్యూలో బింబిసారా పై మాట్లాడుతూనే అప్పుడప్పుడు ఎన్టీఆర్ తో చెయ్యబోయే NTR30 విషయాలను కూడా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ - కొరటాల మూవీ మొదలు పెట్టడానికి టైం పడుతుంది అని, ట్రిపుల్ ఆర్ తో వచ్చిన ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే మూవీ చెయ్యాలి కాబట్టే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కళ్యాణ్ రామ్ చెప్పగా.. ఎప్పటినుండో కళ్యాణ్ రామ్, బింబిసారా 2 లో ఎన్టీఆర్ కనిపిస్తారనే ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు.

Advertisement
CJ Advs

బింబిసారా ఫస్ట్ పార్ట్ హిట్ అయితే పార్ట్ 2 చేద్దామనుకున్నామని, అయితే బింబిసారా చెయ్యడానికి చాలా కష్టపడ్డామని, బింబిసారా హిట్ అయితే ప్రేక్షకులే పార్ట్2 ఎప్పుడు ఉంటుందని అడుగుతారని అన్నారు. అయితే బింబిసారా 2 లో ఎన్టీఆర్ నటిస్తాడనేది అవాస్తవమని.. ఆ విషయం గురించి తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆ ప్రచారం అంతా ఊహగానేలే అంటూ కళ్యాణ్ రామ్ కొట్టిపారెయ్యడమే కాదు, బింబిసారా ని పార్ట్ 2 తో ఆపెయ్యలేమని, అది ఒక ప్రాంచైజీలా కొనసాగించాలనే కోరిక ఉంది. టైమ్ ట్రావెల్‌లో గొప్ప హీరోలు ఎవరైనా యాక్ట్ చేయొచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.

Kalyan Ram About NTR Role in Bimbisara Part 2:

Nandamuri Kalyan Ram UNEXPECTED Answer To Reporter Question About NTR In Bimbisara Part-2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs