Advertisement
Google Ads BL

నిఖిల్ అలా.. నితిన్ ఇలా


నితిన్ - నిఖిల్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్న పేర్లు. కారణం ఆగష్టు 12 న ఈ కుర్ర హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారు. నటించిన సినిమాలు ఒకేసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. నితిన్ మాచర్ల నియోజక వర్గం తోనూ, నిఖిల్ కార్తికేయ 2 తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. నితిన్ భారీగా ట్రైలర్ లాంచ్ అంటూ ఫాన్స్ ని సమీకరిస్తూ మాచర్లపై ఆసక్తిని క్రియేట్ చేతున్నాడు. కానీ నిఖిల్ బుల్లితెర షోస్ లో సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఆఖరికి జీ తెలుగు సీరియల్స్ లో నిఖిల్ కార్తికేయ ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. జబర్దస్త్ లోను కార్తికేయ టీం ఉంది. అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో అనుపమ, నిఖిల్ కనిపించగా, సుమ క్యాష్ షో లోను, ఇలా ఎక్కడ చూసినా నిఖిల్ కార్తికేయ టీం కనిపిస్తుంది. నితిన్ సోలో ఇంటర్వూస్, టీం ఇంటర్వూస్, హీరోయిన్స్ ఇంటర్వూస్ తో హడావిడి మొదలు పెట్టాడు. రీసెంట్ గా విడుదలైన మార్చర్ల ట్రైలర్ యూట్యూబ్ లోను దూసుకుపోతుంది. మరి ఆగష్టు 12 న బరిలో నిలిచే కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో ఆడియన్స్ డిసైడ్ చెయ్యాల్సిందే. 

Nikhil like that.. Nithin like this:

Macherla Niyojakavargam vs Karthikeya 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs