అశ్విని దత్ కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నా ఇండస్ట్రీతో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన కూతుళ్లు స్వప్న దత్ వాళ్ళు నిర్మాణ కార్యక్రమాలను చూసుకోవడంతో ఆయన రిలాక్స్ అయ్యారు. అయితే అశ్విని దత్ నిర్మాతగా ఆక్టివ్ గా లేకపోవడానికి కారణం ఎన్టీఆర్ తో చేసిన శక్తి సినిమా. శక్తి సినిమాని భారీగా నిర్మించి భారీగా లాస్ అయ్యారు అశ్విని దత్. అయితే తాజాగా ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన సీతారామం మూవీ ఇంటర్వూస్ లో భాగంగా ఆయన శక్తి సినిమా ని డైరెక్ట్ చేసిన మెహెర్ రమేష్ పై సంచలనంగా మాట్లాడారు. నా కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా శక్తి సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది అని, దర్శకుడు, ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ లెక్కపోతే మళ్ళీ మీ ముందు నేను ఇలా కూర్చుని మాట్లాడే శక్తి ఉండేది కాదు అంటూ మాట్లాడారు.
మెహర్ రమేష్ కొట్టిన దెబ్బకు నేను విజయవాడకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, కాకపోతే నేను శక్తి ప్లాప్ టైం లో రియల్ ఎస్టేట్ లో ఉండబట్టి మళ్ళీ ఆ దెబ్బనుండి కోలుకోగలిగాను. అంటూ అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మెహెర్ రమేష్ పై మెగా ఫాన్స్ లో అందోళన మొదలయ్యింది. కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న మెహెర్ తో మెగాస్టార్ భోళా శంకర్ చేస్తున్నారు. అది రీమేక్ అయినా.. దానిని మెహెర్ రమేష్ ఎలా హ్యాండిల్ చేస్తారో.. అంటూ వారు మధన పడుతున్నారు. అశ్విని దత్ వ్యాఖ్యలు భోళా శంకర్ మీద ఎమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో అంటూ వారు కాస్త కంగారు పడుతున్నారు.