చిరు కి అల్లుడిగా, శ్రీజ కి భర్త గా మెగా ఫ్యామిలీ లో ఉండాల్సిన కళ్యాణ్ దేవ్.. గత ఆరు నెలలుగా భర్యని వదిలి తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే శ్రీజ కి కళ్యాణ్ దేవ్ కి విడాకులు అయినట్లుగా ఎక్కడా క్లారిటీ లేకపోయినా.. శ్రీజ సోషల్ మీడియా నుండి భర్త కళ్యాణ్ పేరుని తీసేసింది, కళ్యాణ్ దేవ్ శ్రీజ ని వదిలి తన కూతురు నివిష్కని వదిలి పేరెంట్స్ దగ్గరకి వెళ్లిపోవడంతో ఆల్మోస్ట్ వీరు విడిపోయారని అనుకుంటున్నారు. గత ఆరు నెలలుగా కళ్యాణ్ దేవ్ మెగా ఇంటి వైపు చూసింది లేదు. కూతురిని కలిసిన సందర్భం లేదు.
కానీ రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ ఇంటికి నివిష్క వచ్చింది. కళ్యాణ్ దేవ్ కూతురు నివిష్క తో ఆడుకుంటూ అల్లరి చేసిన పిక్స్ ని ఇన్స్టా లో పోస్ట్ చేసారు. కూతురితో కళ్యాణ్ దేవ్ ని చూసిన నెటిజెన్స్ కళ్యాణ్ - శ్రీజ కలిసిపోయారా.. అబ్బ చిరు కి కాస్త ఊరట దక్కినట్టే అంటుంటే.. అటు విడాకులు తీసుకున్న జంటకి పిల్లలు ఉంటే వారు అటు తల్లితోనూ, ఇటు తండ్రితో గడిపేందుకు కోర్టు అనుమతి ఇచ్చి ఉంటుంది. అలా ఆరు నెలలు శ్రీజ, ఆరు నెలలు కళ్యాణ్ దేవ్ ల దగ్గర నివిష్క ఉంటుందేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.