ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పటికి సినిమాల్లో ఉంటూ హీరోలకి తల్లి పాత్రలతో అభిమానులకి చేరువలోనే ఉంటున్న జయసుధ.. నటిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. తాజాగా జయసుధ ఓ టివి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ పై, హీరోయిన్స్ ఖర్చు పై షాకింగ్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు హీరోయిన్స్ ని ఇక్కడి వారు చిన్న చూపు చూస్తారని, స్టార్ హీరోయిన్ అయినా నాకు ఇలాంటి తిప్పలు తప్పలేదని చెప్పిన జయసుధ నటిగా 50 ఇయర్స్ పూర్తి చేసుకున్నాను. అదే బాలీవుడ్ లో అయితే కనీసం బొకే పంపి విష్ చేసేవారు. కానీ ఇక్కడ అది కూడా ఉండదు. ఎవరూ ఎవరిని పట్టించుకునేవారు ఉండరు.
స్టార్ హీరోలని ఒకలాగా, చిన్న హీరోలని మరోలా ట్రీట్ చేస్తారని, అంతేకాకుండా తెలుగులో ఉన్న హీరోయిన్స్ ని చిన్న చూపు చూస్తారు. అదే బాలీవుడ్ నుండి ఎవరైనా దిగితే వారి కుక్కపిల్లకి కూడా స్పెషల్ గా రూమ్స్ ఆరెంజ్ చేస్తారని, బాలీవుడ్ నుండి ఎవరు వచ్చినా స్పెషల్ గా చూస్తారని జయసుధ షాకింగ్ గా మాట్లాడారు. మరి హీరోలు కూడా అలానే ఉంటారా అని అడిగితె వాళ్లది ఏం ఉండదు. వాళ్ళ పక్కన ఉండేవారే ఎక్కువ చేస్తారు.. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే పద్మశ్రీ కి అర్హులా.. సౌత్ వారు పనికిరారా అంటూ జయసుధ చేసిన కామెంట్స్ ప్రోమోలో వైరల్ అయ్యాయి.