మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాప్ గురించి ఏం మట్లాడాలనుకోవడం లేదు. కానీ తదుపరి సినిమా విషయంలో చిరు యమా స్పీడు గా షూటింగ్స్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ దసరా స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో.. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. లూసిఫర్ లో మోహన్ లాల్ చాలా గంభీరంగా వైట్ అండ్ వైట్ లో హుందాగా కనిపిస్తారు. ఆయన కేరెక్టర్ కి హీరోయిన్ కానీ, సాంగ్స్ కానీ ఉండవు.
మోహన్ లాల్ కి బాడీ గార్డ్ గా సీరీస్ లుక్ లో పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించారు. కానీ ఇక్కడ తెలుగు గాడ్ ఫాదర్ విషయానికి వచ్చేసరికి.. చిరు లుక్ బ్లాక్ అండ్ బ్లాక్ లోకి మార్చారు. అలాగే ఈసినిమాలో చిరు - సల్మాన్ ఖాన్ నడుమ ఫాన్స్ ని ఊపేసే సాంగ్ డిజైన్ చేసారు. కానీ చిరు కేరెక్టర్ గంభీరంగా ఉండాలి. ఆ కేరెక్టర్ చేత డాన్స్ స్టెప్స్ వేయిస్తే ఫాన్స్ కి ఓకె కానీ.. కథ పరంగా ఆ సాంగ్ వర్కౌట్ అవుతుందా అసలు.. అనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. లూసిఫర్ సినిమా చూస్తున్నంతసేపు మోహన్ లాల్ కేరెక్టర్ గురించే మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ చిరు తో స్టెప్స్ వేయిస్తే ఏం బావుంటుంది అంటున్నారు