బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ - లవ్ రంజన్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబయి శివారు అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ మైదానంలో జరుగుతుంది. చిత్రకూట్ మైదానంలో వేసిన భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కడ మైదానంలో రెండు సినిమాల సెట్స్ పక్కపక్కనే వేసినట్లుగా తెలుస్తుంది. రాజశ్రీ ప్రొడక్షన్స్ చిత్రం సెట్, మరోచోట డైరక్టర్ లవ్ రంజన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రాల సెట్స్ వేశారు.
అయితే ఉన్నట్టుండి రణబీర్ కపూర్ నటిస్తునం చిత్ర సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో.. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడినట్లుగా తెలుస్తుంది. మనీశ్ దేవాశీ అనే కుర్రాడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మనీశ్ మృతిచెందినట్లుగా వైద్యులు తెలపడంతో అంతా ఒక్కసారిగా షాకవ్వగా.. ప్రస్తుతం షూటింగ్స్ ఆపేసినట్లుగా తెలుస్తుంది.