Advertisement
Google Ads BL

ముంబై లోనే మకాం వేశారు


రాజమౌళి బాహుబలి ప్రమోషన్స్ అప్పుడు, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ అప్పుడు కొన్నాళ్ళు ముంబైలోనే ఉన్నారు. అక్కడ ఈవెంట్స్, టాక్ షోస్ అంటూ సినిమాలని ప్రమోట్ చేసుకుని వెనక్కి వచ్చేసారు. అంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటూ ఇతర భాషల్లో సినిమాలను ప్రమోషన్స్ చేసారు. కానీ ఇప్పుడు లైగర్ టీం అంటే పూరి జగన్నాధ్, ఛార్మి, విజయ్ దేవరకొండ లు హైదరాబాద్ నుండి ఎప్పుడో ముంబై కి మకాం మార్చేశారు. ముంబైలోనే కాస్ట్లీ ఆఫీస్ తీసుకుని అక్కడే ఉంటూ.. లైగర్ షూటింగ్ ని పూర్తి చేసారు. తర్వాత ప్రమోషన్స్ ని హైదరాబాద్ నుండి చేస్తారు.. అప్పుడప్పుడు ముంబై వెళతారు అనుకుంటే.. ముంబై లోనే మకాం పెట్టారు. 

Advertisement
CJ Advs

అక్కడ బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ మాదిరి ముంబైలో లైగర్ ని తెగ ప్రమోట్ చేస్తూ వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చివెళుతున్నారు. అంటే ముంబై నుండే లైగర్ ప్రమోషన్ కార్యకలాపాలను హ్యాండిల్ చేస్తుంది టీం. నిన్న శుక్రవారం ముంబై మెట్రో లో ప్రయాణం చేసిన విజయ్ దేవరకొండ, అనన్య పాండే లు సినిమాని ప్రమోట్ చెయ్యడమే కాదు అనన్య ఒడిలో పడుకుని విజయ్ కునుకు తీసిన పిక్స్ వైరల్ అయ్యాయి. మరి లైగర్ ని ఎక్కువగా నార్త్ ఇండియన్ ప్రేక్షకుల దగ్గరకి చేర్చేందుకు లైగర్ టీం ఈ విధంగా ముంబై లోనే మకాం వెయ్యాల్సి వచ్చిందన్నమాట.

Liger promotions in Mumbai:

Vijay Devarakonda - Ananya Panday Travelling in Mumbai metro for Liger promotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs