విజయ్ దేవరకొండ - రష్మిక వరసగా రెండు సినిమాల్లో కలిసి నటించడంతో, ఈ పెయిర్ షూటింగ్స్ సమయంలో ప్రేమలో పడ్డారని, సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని, ముంబైలో తరచూ డిన్నర్ డేట్స్‌కి వెళుతున్నారని ప్రచారం గట్టిగానే జరిగింది. విజయ్ - రష్మిక ఇద్దరూ ఒకేసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం ముంబై వెళ్లడం, రష్మికకి బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో ముంబైలోనే ఉన్న విజయ్ దేవరకొండతో ఫ్రెండ్లీగానే ఉంటున్నట్లుగా విజయ్ - రష్మిక ఎంత చెప్పినా.. వారిపై మాత్రం రూమర్స్ ఆగడం లేదు. రీసెంట్‌గా కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండని కరణ్ జోహార్ రష్మికతో డేటింగ్ విషయమై అడిగారు.
నేను, రష్మిక మంచి ఫ్రెండ్స్.. ఇద్దరం కెరీర్ ఆరంభంలోనే కలిసి సినిమాలు చెయ్యడంతో అలాంటి రూమర్స్ వచ్చాయి, కానీ మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. రష్మిక అంటే చాలా ఇష్టం, ఆమె నాకు ప్రియమైన వ్యక్తి కూడా. సినిమాల విషయంలో అన్ని మాట్లాడుకుంటాము, దాని ద్వారా మా మధ్యన ఫ్రెండ్‌షిప్ అనే బంధం మరింతగా బలపడుతుంది.. అంటూ విజయ్ దేవరకొండ రష్మికతో డేటింగ్ విషయమై స్పందించాడు. అయితే కరణ్ జోహార్ మాత్రం నీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఎందుకు బయట పెట్టవ్ అని అడగగా.. నన్ను ఆరాధించే వారిని బాధ పెట్టలేను.. హీరోని కాబట్టి ఎంతోమంది ప్రేమిస్తారు.. వారు వాల్ పేపర్స్‌గా, ఫోన్‌లో పోస్టర్స్‌గా నా ఫొటోస్ పెట్టుకుంటారు. వారి ప్రేమ ప్రోత్సాహాన్నిస్తుంది. అందుకే వారి హార్ట్ బ్రేక్ చేయాలనుకోవడం లేదంటూ విజయ్ దేవరకొండ తన రిలేషన్‌ని మాత్రం బయట పెట్టకుండా దాచేశాడు.