Advertisement
Google Ads BL

జాన్వీ కపూర్ భర్తకి ఉండాల్సిన లక్షణాలు


శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో టాప్ పొజిషన్ కోసం తంటాలు పడుతుంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో శృతి మించి గ్లామర్ షో చేస్తున్నా.. జాన్వీ కపూర్‌కి స్టార్ హీరోల ఆఫర్స్ తగలడం లేదు. అందుకే ఎక్కువగా అందాల ఆరబోతపైనే జాన్వీ కపూర్ ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని తన తండ్రి కోరుకుంటున్నారో అనే విషయంపై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శ్రీదేవి చనిపోకముందు నుండి కూడా బోనీ కపూర్ ఎప్పుడూ ఫ్యామిలీకి దగ్గరగా.. జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లని ప్రేమగా చూసుకునేవారు. శ్రీదేవి మరణం తర్వాత కూడా బోనీ కపూర్ వారిని అంతే జాగ్రత్తగా చూసుకుంటూ తల్లి లేని లోటుని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

 

అయితే జాన్వీ కపూర్‌కి కాబోయే భర్త విషయంలో ఆయనకి కొన్ని అంచనాలు ఉన్నట్లుగా జాన్వీ కపూర్ చెబుతుంది. నాకు కాబోయే భర్త మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. నాన్నకి ప్రాబ్లెమ్ లేదు. కానీ హైట్ విషయంలో మాత్రం ఆయనకన్నా పొడవుగా ఉన్న అబ్బాయి కావాలంటున్నారు. నాన్న పొడవు 6.1 అంటూ.. ఫన్నీ కామెంట్స్ చేసింది. ఇక అప్పుడప్పుడు బోనీ కపూర్ తన ఇద్దరి కూతుళ్లతో జాన్వీ, ఖుషి మీరు మీ భర్తలతో ఒక్కటే చెప్పండి.. మా నాన్న మమ్మల్ని ప్రపంచం మొత్తం తిప్పి చూపించారు అని. అంటే మా భర్తలు మమ్మల్ని అంత కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకోవాలని దానర్థం అంటూ.. జాన్వీ కపూర్ తండ్రి ఆలోచనలను పంచుకుంది.

Janhvi Kapoor reveals Father’s Condition for her Groom:

Janhvi Kapoor Reveals Her Father, Boney Kapoor Conditions on Her Husband to be. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs