Advertisement
Google Ads BL

ఎమోషనల్ గా జబర్దస్త్ కి అనసూయ వీడ్కోలు


అనసూయ జబర్దస్త్ ని వీడింది. కమెడియన్స్ అంత ఎమోషనల్ గా అనసూయ కి వీడ్కోలు పలికారు. జెడ్జ్ ఇంద్రజ అయితే వెక్కి వెక్కి ఏడవడం ఈ ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. రెండేళ్లుగా జబర్దస్త్ ని మానేయాలని అనుకుంటున్నా.. ఇప్పటికీ నా నుండి ఆ మాట రావడానికి ఇంత టైం పట్టింది అంటూ అనసూయ ఓపెన్ అయ్యింది. చలాకి చంటి, రాఘవ కూడా ఎమోషనల్ గా మా కోసం మూడు రోజులు టైం ఇవ్వలేవా అనేసరికి ఇంద్రజ ఏడ్చేసింది. నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము, కానీ మూడు రోజులు మా కోసం రా అంటూ చంటి కాస్త డల్ గా మాట్లాడాడు.

Advertisement
CJ Advs

జబర్దస్త్ కి ఎంతోమంది వస్తారు, వెళతారు, కానీ జబర్దస్త్ ఆగదు.. కొత్త వాళ్లతో మరింతగా వెలిగిపోతుంది అని రాఘవ చెప్పాడు. అనసూయ మరీ ఎమోషనల్ గా కాకుండా తనకి రంగస్థలం ఆఫర్ వచ్చినప్పుడు నాకు జబర్దస్త్ ఎంతో సపోర్ట్ ఇచ్చింది అని చెప్పింది కానీ.. వేరే ఈవెంట్స్ వలనే నేను జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నా అని చెప్పలేదు. ఇక ఇంద్రజని హగ్ చేసుకున్న అనసూయ.. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా జబర్దస్త్ ని వీడిన అనసూయ ఈ గురువారం స్కోర్స్ చెప్పించి, రాఘవ, చలాకి చంటి టీమ్స్ విన్ అని ప్రకటించి కామ్ గా స్టేజ్ దిగి వెళ్ళిపోయింది.

Emotionally, Anasuya bids farewell to Jabardast:

Anasuya Bharadwaj Quits Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs