నాగ చైతన్య సమంత ని వివాహం చేసుకునే ముందు మురళి మోహన్ ముచ్చట పడి కట్టించుకున్న ఇంటిని నాగార్జున తో చెప్పించి మరీ సొంతం చేసుకున్నాడని, సమంత తో పెళ్లి తరవాత ఇద్దరూ అదే ఇంటిలో కలిసి ఉన్నారని, తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుని వారు ఉంటున్న ఇంటిని చైతూ అమ్మేసాడని మురళి మోహన్ ఎప్పుడో చెప్పారు. అయితే చైతు వాళ్ళు అమ్మిన వాళ్ళకి ఇల్లు అప్పజెప్పకముందే విడిపోవడంతో.. చైతూ ఆ ఇంటిని సమంత కి వదిలేసి సపరేట్ గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమంత ఆ ఇంట్లో ఉంటూనే మరో ఇల్లు కొనడానికి చాలా ట్రై చేసిందట.
అన్ని హంగుల తో ఉన్న ఇంటిని కొనడానికి సమంత ప్రయత్నం చేసినా.. కుదరక పోయేసరికి.. తాను ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే అన్ని బావున్నాయని, ఇక్కడ ఉంటే సేఫ్టీ ఉంటుంది అని గ్రహించి నా దగ్గరకి వచ్చింది అని మురళి మోహన్ చెబుతున్నారు. అప్పుడు నేను సమంత తో ఆ ఇల్లు నేను అమ్మాను, మీరు కొన్నారు, మీరు వేరేవాళ్లకి అమ్మేసారు. ఇప్పుడేం చేయగలమని చెప్పాను. అప్పుడు సమంత ఆ కొన్నవాళ్ళతో మాట్లాడి.. వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇచ్చి మరీ ఆ ఇల్లుని కొనేసింది అని, ఇప్పుడు సమంత తన తల్లితో పాటుగా అక్కడే చైతు తో నివసించిన ఇంట్లోనే ఉంటున్నట్టుగా మురళి మోహన్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.