Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6 కి 'నో' చెప్పిన యాంకర్


బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కావడానికి టైం దగ్గర పడుతుండడంతో బుల్లితెర ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతుంది. ఎందుకంటే ఈసారి ఎలాంటి వారు వస్తారో.. హౌస్ లో ఎంత రచ్ఛ చేస్తారో అని వాళ్ళ ఆత్రుత. సీజన్ వన్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా కూల్ గా నడవగా, సీజన్2 లో నాని ని హౌస్ మేట్స్ ఆడుకున్నారు. కౌశల్ ఆర్మీ ఓవరేక్షన్ చేసింది. ఇక సీజన్3 నుండి నాగార్జున హోస్ట్ గా వచ్చారు. అక్కడ పునర్నవి - రాహుల్ సిప్లిగంజ్ లవ్ బర్డ్స్ కింద ప్రొజెక్ట్ చేసి హైలెట్ చేసారు. ఇక సీజన్ 4 లో అయితే అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్యలో ప్రేమ పుట్టించారు. అభిజిత్ విన్నర్ అవగా, అఖిల్ రన్నర్ గా నిలిచాడు. 

Advertisement
CJ Advs

ఇక సీజన్ 5 లో విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్ రన్నర్ గా నిలవగా అతని ఇమేజ్ సిరి ఫ్రెండ్ షిప్ తో డ్యామేజ్ అయ్యింది. ఇలాంటి ఆసక్తికర విషయాలతో సీజన్ 6 కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 6 కోసం యాంకర్ ఉదయభాను ని యాజమాన్యం సంప్రదించింది అనే టాక్ నడుస్తుంది. గతంలో కాస్త బిజీగా ఉన్న ఉదయభాను పెళ్లి, పిల్లలు తర్వాత అవకాశాలు రాకో.. లేదంటే ఆమె కావాలనే వెనక్కి తగ్గిందో కానీ.. బుల్లితెర మీద పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పడు ఉదయభాను కోసం బిగ్ బాస్ యాజమాన్యం భారీ పారితోషకం ఇస్తాను అని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. ఉదయ భాను మాత్రం బిగ్ బాస్ కి వచ్చేందుకు నో చెప్పినట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ కి రాలేను, ప్రస్తుతం కమిట్మెంట్స్ ఉన్నాయంటూ ఆమె దాటవేసింది అంటున్నారు.

The anchor who said no to Bigg Boss 6:

Udaya Bhanu rejected Bigg Boss 6 offer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs