Advertisement
Google Ads BL

తారక్ కి నచ్చింది.. నమ్మకం పెరిగింది


కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా మూవీ ఆగష్టు 5 న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతుంటే.. ఆ సినిమా ఈవెంట్ కోసం ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నాడంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆసక్తికరంగా మార్చేసారు. అయితే కళ్యాణ్ రామ్ సోలో ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్ అంటూ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు. తాజాగా కళ్యాణ్ రామ్ ని మీరు వసిష్ఠ తో ఇంత భారీ మూవీ తీస్తున్నారు. ఆయన కొత్త దర్శకుడు కదా ఏం భయం అనిపించలేదా అని అడగగా.. నేను అతనొక్కడే అప్పుడు సురేందర్ రెడ్డి కి దర్శకుడిగా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను. ఆ సినిమా హిట్. అలాగే గుహన్ తో 118, ఇంకా అనిల్ రావిపూడి కి పటాస్ తో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాను. అది కూడా సూపర్ హిట్. సో బింబిసారా కూడా సిల్వర్ స్క్రీన్ పై వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం ఉంది అన్నారు కళ్యాణ్ రామ్.

Advertisement
CJ Advs

అయితే బింబిసారా స్టోరీ నాకు నప్పుతుందా? అది రాజుల కథ? టాలీవుడ్ లో రాజు అంటే బాహుబలి ప్రభాస్ గుర్తుకు వస్తాడు. నేను అసలు రాజు గెటప్ లో సెట్ అవుతానో.. లేదో.. అనే సందేహం చాలా ఉండేది. అసలు ఇలాంటి పాత్రను నేను చేయటం రిస్క్ అవుతుందా.. అనిపించింది. ఇక రాజుగా లుక్ విషయంలో, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కసరత్తులు చేసాము. నేను రాజుగా మారిన తర్వాత నా లుక్ ని ముందుగా తారక్ కి చూపించాను. బావుందన్నయ్యా, సెట్ అయ్యావు, సూపర్బ్ అని తారక్ చెప్పడంతోనే రాజుగా నాపై నాకు నమ్మకం కలిగింది అంటూ కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.  

Tarak liked it.. The trust increased: Kalyan ram:

Kalyan Ram About Tarak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs