గత కొన్ని వారాలుగా ఎన్నో అంచనాల మధ్యన బాక్సాఫీస్ దగ్గరకు వస్తున్న సినిమాలు ఆడియన్స్ ని శాటిస్ ఫై చెయ్యడం లో విఫలం అవుతున్నాయి. అన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే. కానీ అనుకున్న అంచనాలను రీచ్ అవ్వలేక చేతులెత్తేస్తున్నాయి. అందులో గోపీచంద్ పక్కా కమర్షియల్, లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే, రామ్ వారియర్, నాగ చైతన్య థాంక్యూ మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాలు ఆడియన్స్ అంచనాలు అందుకోలేకపోయాయి. అందుకే ఈ వారం విడుదల కాబోతున్న రవితేజ రామారావు ఆన్ డ్యూటీ పైనే అందరి చూపు ఉంది.
ఖిలాడీ లాంటి భారీ డిసాస్టర్ తర్వాత రవితేజ నుండి వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాకి కొత్త దర్శకుడు శరత్ మండవ అయినా.. రామారావు కథ కొత్తగా కనబడుతుంది. రవితేజ లుక్స్ వైజ్ గాను అలాగే యాక్షన్ పరంగాను ఆకట్టుకునేలా ఉన్నాడు. అంతేకాకుండా వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్ర చెయ్యడం ఆసక్తిని కలిగించే అంశాలు. భారీ టార్గెట్ కాకపోయినా.. చెప్పుకునేంత టార్గెట్ తోనే రామారావు ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రంగం సిద్ధమైంది. మరి రవితేజ అయినా రామారావు ఆన్ డ్యూటీ తో హిట్ కొట్టి ప్రేక్షకులని శాటిస్ ఫై చేస్తాడో.. లేదో.. చూడాలి