Advertisement
Google Ads BL

అమెరికాకి కమల్ హాసన్.. కారణం


కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత విక్రమ్ హిట్ తో ఫుల్ కిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బడ్జెట్ పెట్టిందానికి మూడింతల కలెక్షన్స్ రావడంతో కమల్ హ్యాపీ గా ఉన్నారు. అప్పులన్నీ తీర్చేసాను అంటూ అప్పట్లో ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే విక్రమ్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా, ఓటిటి హాట్ స్టార్ లోను విక్రమ్ నెంబర్ వన్ ప్లేస్ నిలిచింది. ఇక కమల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో అంచనాలు మొదలైపోయాయి. ఈలోపు కమల్ హాసన్ - శంకర్ ల భరతీయుడు 2 షూట్ రెస్యూమ్స్ అంటూ వార్తలొస్తున్నాయి. 

Advertisement
CJ Advs

అందుకే కమల్ హాసన్ అమెరికా వెళ్లారట. అంటే ఇండియన్ 2 లుక్ కోసం మరోసారి మేకోవర్ అయ్యేందుకు కమల్ హాసన్ అమెరికా ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తుంది. మూడు వారాల పాటు ఆయన అమెరికాలోనే ఉండి, భారతీయుడు2 సినిమాకి తగ్గట్టు తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారని, కమల్ అమెరికా నుండి రాగానే.. భారతీయుడు 2 ని పట్టాలెక్కించేందుకు శంకర్ కూడా ప్లాన్ చేస్తున్నారట. గతంలో భారతీయుడు2 సెట్స్ లో జరిగిన ప్రమాదం కారణం ఆ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. మధ్యలో కోర్టు గొడవలు, అవి ఇవి.. ఇదిగో మళ్ళీ ఇప్పుడు శంకర్ - కమల్ మరోసారి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Kamal Haasan begins prep for Indian 2 in USA:

Kamal Haasan leaves to the US to begin prep work for the long delayed Indian 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs