ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆతృతగా, ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఇంకా ఇంకా వెనక్కి వెళుతుంది కానీ.. దానిపై ఎలాంటి అప్ డేట్ బయటికి రానివ్వడం లేదు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ - కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్న ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ వెయిటింగ్. అయితే ప్రభాస్ బర్త్ డే వరకు ఆదిపురుష్ నుండి ఎలాంటి అప్ డేట్ రాదు అని చెబుతున్నా.. ఫాన్స్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఈ మధ్యలో ఏదో ఒక అప్ డేట్ కావాలంటూ ఓం రౌత్ ని నిర్మాణ సంస్థని సతాయిస్తూనే ఉన్నారు. కానీ అటువైపు నుండి నో రెస్పాన్స్.
ఈ రోజు బుధవారం ఆదిపురుష్ జానకి అదేనండి కృతి సనన్ బర్త్ డే. ఆమె బర్త్ డే కి కనీసం కృతి సీత లుక్ అయిన వదులుతారని ఆశ పడినా ఓం రౌత్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. అంటే ప్రభాస్ ఫస్ట్ లుక్ వదలకుండా కృతి లుక్ వదిలితే బాగోదు అని ఓం రౌత్ అనుకున్నారేమో అందుకే కృతి సనన్ కి విష్ చెయ్యడానికి ఆదిపురుష్ నుండి లుక్ వదలకుండా ఆమెకి జస్ట్ విషెస్ చెప్పరేమో అంటుంటే.. ఇది మరీ అన్యాయం కదా డైరెక్టర్ సారూ అంటూ ప్రభాస్ ఫాన్స్ మాత్రం నిరాశ పడిపోతున్నారు.