మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కుతున్న తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ ఈమధ్యనే మొదలయ్యింది. ఇప్పటికే భోళా శంకర్ నుండి మెగాస్టార్ లుక్ ని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. అందులోనూ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటించడం, తమన్నా హీరోయిన్ గా నటించడమే కాకుండా అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ కోసం భారీ గా ఖర్చు పెడుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో అనిల్ సుంకర భోళా శంకర్ పై మెగా ఫాన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అది భోళా శంకర్ లో కేవలం సిస్టర్ సెంటిమెంట్ మాత్రమే హైలెట్ కాదు అని, ఈ సినిమా మెగా ఫాన్స్ కి పూనకాలు తెప్పించే మాస్ కమర్షియల్ హంగులతోనే తెరకెక్కుతుంది అని, అనుకున్నట్టుగా అవుట్ ఫుట్ బాగా వస్తుంది అని, భోళా శంకర్ ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నట్టుగా అనిల్ సుంకర చెప్పడంతో.. మెగా ఫాన్స్ కూల్ అవుతున్నారు. ఆచార్య దెబ్బకి డిస్పాయింట్ అయిన మెగా ఫాన్స్.. గాడ్ ఫాదర్ పై నమ్మకం, ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అనిల్ సుంకర వ్యాఖ్యలతో మెగా ఫాన్స్ భోళా శంకర్ పై మరింత హుషారు అవుతున్నారు.