ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో పడింది.. సినిమా బడ్జెట్ పెరిగిపోవడం, హీరోల పారితోషకాలు పెరగడం, షూటింగ్ ఖర్చులు పెరగడంతో నిర్మాతలు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఒక భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ తీసిన తర్వాత మరోసారి ఆ నిర్మాతలు పెద్ద సినిమాలు జోలికి వెళ్లడం లేదు. మరోపక్క ఓటిటీల హవా తో థియేటర్స్ మూతబడే పరిస్థితి రావడంతో.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ విషయాలపై చర్చలు మొదలు పెట్టి ఓటిటీల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. కానీ బడ్జెట్ విషయంలో, హీరోల రెమ్యునరేషన్ విషయంలో ఇంకా చర్చలు సఫలం కాకపోవడంతో ఆగష్టు 1 నుండి షూటింగ్స్ బంద్ అంటున్నారు.
తాజాగా స్టార్ హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బడ్జెట్ ప్రోబ్లెంస్ తగ్గుతాయని అంటున్నారు. దీనిలో భాగంగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో రెమ్యునరేషన్ విషయంలో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్, చరణ్, బన్నీ ముగ్గురూ తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్దపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిర్మాతల చర్చల ఫలితం స్టార్ హీరోలు రెమ్యునరేషన్ విషయంలో ఆలోచన చేస్తే ఆగస్టు 1 నుండి షూటింగ్స్ బంద్ కావని.. యధావిధిగా షూటింగ్స్ నడుస్తాయనే టాక్ వినిపిస్తుంది.