Advertisement
Google Ads BL

'సార్' ఫస్ట్ లుక్ సూపర్బ్, టీజర్ టైం ఫిక్స్


నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ తో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న మూవీ సార్, సార్ మూవీ షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాలో ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కట్టింది. ఈ మధ్యనే యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్ స్లోగన్ తో ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన టైటిల్ వీడియో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ధనుష్ పుట్టినరోజు జూలై 28 సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ సార్ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో ధనుష్ సార్ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ సార్ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.  

Advertisement
CJ Advs

ఫస్ట్ లుక్ తో పాటుగా ధనుష్ పుట్టినరోజు సందర్భంగా రేపు గురువారం సాయంత్రం 6 గంటలకు సర్ టీజర్ వదిలేందుకు ప్లాన్ చేసి మరీ అప్ డేట్ ఇచ్చింది టీం. 

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సార్ చిత్రంలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ. నేడు విడుదల ఆయన ప్రచార చిత్రం కానీ, రేపు మా హీరో ధనుష్ గారు పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న వీడియో చిత్రం కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది చిత్రం. దీనికి తగినట్లుగా ధనుష్ గారు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది అన్నారు. 

Dhanush Sir First look revealed :

Dhanush SIR first look increases speculation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs