Advertisement
Google Ads BL

మరో నటుడిపై 'అమ్మా' సన్సేషనల్ కామెంట్స్


అమ్మా రాజశేఖర్ డైరెక్ట్ చేసిన హై ఫై మూవీ ఆడియన్స్ ముందుకు తీసుకురాబోయే ముందు అమ్మా రాజశేఖర్ మీడియాలో హైలెట్ అయ్యేందుకు గతంలో తనకు జరిగిన మోసాలు, అవమానాలను బయట పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మా రాజశేఖర్ హీరో నితిన్ తనని మోసం చేసాడు అంటూ ఓ ఈవెంట్ లో నితిన్ పై రెచ్చిపోయి మాట్లాడారు. తాను డాన్స్ నేర్పించిన గురువుని అని, కానీ నితిన్ మాట సాయం చేయమని అడిగినా చెయ్యకుండా మోసం చేసాడు అంటూ మాట్లాడారు. అలాగే గోపీచంద్ కూడా మోసం చేసాడు అని, తాను చెప్పిన స్టోరీ లైన్ తో వేరే డైరెక్టర్ తో సినిమా చేసాడంటూ సంచలనంగా మాట్లాడారు.

Advertisement
CJ Advs

తాజాగా మరో నటుడు జేడీ చక్రవర్తిపై అమ్మా రాజశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. జెడి చక్రవర్తి తో ఉగ్రం సినిమా చేశాను. జేడీ తో సినిమా అనుకున్నప్పుడు జేడీ చక్రవర్తి సినిమా మధ్యలో వేళ్ళు పెడతారని చాలామంది చెబితే నేను డైరెక్ట్ గా వెళ్లి అడిగేసాను. మిమ్మల్ని నమ్ముతున్నా మాస్టర్ నేను మధ్యలోకి రాను అని జేడీ మాటిచ్చాడు. ఇక సినిమా చేశాను. మా నిర్మాత చాలా మంచివాడు. ఉగ్రం సినిమాకి 60 లక్షల బిజినెస్ చేసేసరికి దిల్ రాజులా ఫీల్ అయ్యాడు. అందులో నాకు షేర్ ఇవ్వలేదు. నన్ను మోసం చెయ్యాలని జేడీ, నిర్మాత చూసారు. అసలైతే వచ్చిన దానిలో సగం నాకివ్వాలి. కానీ కొంచెం కూడా ఇవ్వలేదు. ఓ 50 వేలతో సరిపెట్టేసారు. 

ఓసారి మా అమ్మకి సీరియస్ అయితే జేడీని నాకు ఇవ్వాల్సిన డబ్బు అడిగాను. 5 లక్షలు ఇమ్మన్నా, కనీసం లక్ష ఇమ్మన్నా ఇవ్వకుండా నన్ను మోసం చేసాడు.. ఉగ్రం ఫస్ట్ కాపీ వచ్చాక జేడీ సినిమాలో తలదూర్చి సర్వనాశనం చేసాడు. నేను చెప్పింది వింటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. వీళ్లంతా నన్ను మోసం చేసి బాగుపడలేదు. వాళ్ళ కెరీర్ ని వాళ్ళే నాశనం చేసుకున్నారు అంటూ సెన్సేషనల్ గా మాట్లాడారు అమ్మా రాజశేఖర్.

Amma Rajasekhar Sensational comments on JD:

Amma Rajasekhar comments on JD Chakravarthy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs