Advertisement
Google Ads BL

RC15 షూటింగ్ కి చుక్కెదురు


రామ్ చరణ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో RC15 సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ప్రొడక్షన్ లో చేస్తున్నారు. రామ్ చరణ్ నటించితిన్ ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ అంతటి హై స్టాండర్డ్స్ తో వస్తున్న RC15 పై మెగా ఫాన్స్ లోనే కాదు.. తెలుగు, తమిళ, హిందీ ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఉంది. ప్రస్తుతం RC15 న్యూ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసారు శంకర్. అయితే RC15 షూటింగ్ ని సరూర్ నగర్ లోని ఓ స్కూల్ లో ప్లాన్ చేసుకుని.. టీం మొత్తం అక్కడ హడావిడి మొదలు పెట్టగానే ఆ ఏరియా కార్పొరేటర్ RC15 షూటింగ్ జరగనివ్వకుండా అడ్డుకుని, అందోళన చేపట్టడంతో తాత్కాలికంగా RC15 షూటింగ్ ఆపేసింది టీం.

Advertisement
CJ Advs

స్కూల్స్‌లో షూటింగ్ చేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఎలా ఇస్తార‌ని, సినిమా షూటింగ్స్ చేయ‌టం వ‌ల్ల చదువుకుంటున్న విద్యార్థుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని కార్పొరేటర్ శ్రీవాణి వాదించడమే కాదు, ఆమె అక్కడ షూటింగ్ జరక్కుండా అడ్డుకోవడంతో షూటింగ్ ని ఆపెయ్యాల్సి వచ్చింది. ఈ విషయమై RC15 టీం నుండి ఎలాంటి స్పందన లేదు. RC15 ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని ఆగష్టు 15 న వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. 

Protests against RC15 shocks all:

Why did protests erupt against RC15?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs