విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ రిలీజ్ అవ్వడానికి కేవలం 30 డేస్ అంటూ టీం ఓ చిన్నపాటి వీడియో కట్ వదిలింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డ్ లైక్స్ తో వ్యూస్ తో రౌడీ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టించారు. పూరి మార్క్ డైలాగ్స్ లేకపోయినా, అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాకి కాపీ అంటున్నా తెలుగులోనూ లైగర్ ట్రైలర్ హిట్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల దగ్గరనుండి గంటగంటకు 50, 60, 70 మిలియన్లు ఇలా లెక్క పెరుగుతూనే పోతోంది. మరి పాన్ ఇండియా మూవీ ట్రైలర్ ఆ రేంజ్ హిట్ అంటే మాములు విషయం కాదు.
అందుకే లైగర్ ట్రైలర్ హిట్ అయిన సందర్భంగా నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ కలిసి పార్టీ చేసుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛార్మి - విజయ్ లు మందు కొడుతూ ఫుల్ గా ఛిల్ అవుతున్నారు. చార్మీతో విజయ్ చీర్స్ కొడుతూ పోజులు ఇచ్చిన పిక్ ని ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ చూసిన నెటిజెన్స్.. ట్రైలర్ హిట్టు, హీరో పార్టీ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ కామెంట్స్ పెడుతున్నారు.