Advertisement
Google Ads BL

ఓం కార్ పేరెత్తకుండా కడిగిపారేసింది


ఆట డాన్స్ షో నుండి ఓం కార్ యాంకర్ గా బాగా పాపులర్ అయ్యాడు. ఆట డాన్స్ షో తో చాలామంది డాన్స్ మాస్టర్స్ వెలుగులోకి వచ్చారు. కానీ ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ షో అంతగా ఆట డాన్స్ మాస్టర్స్ పాపులర్ అవ్వలేదు. అలాగే ఢీ షో తో డాన్స్ మాస్టర్స్ టాలీవుడ్ లో సెటిల్ అయినట్లుగా ఆట డాన్స్ మాస్టర్స్ కి టాలీవుడ్ అవకాశాలు రాలేదు. ఏదో ఓం కార్ షోస్ లోనే వారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు. అయితే గతంలో ఆట షో లోనే ఓం కార్ తన తమ్ముడి కోసం నన్ను తొక్కేసాడు అంటూ నటరాజ్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మనిషి చాలా మంచోడు, తమ్ముడి కోసం నన్ను పక్కన పెట్టడం కొద్దిగా బాధగా వున్నా తన ధర్మం నిర్వర్తించాడు అంటూ ఓం కార్ పై కామెంట్స్ చేసాడు నటరాజ్.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఆట షో తో వెలుగులోకి వచ్చిన సందీప్ డాన్స్ షోస్ కి, అలాగే మూవీ ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. ఇస్మార్ట్ జోడిలోనూ పార్టిసిపేట్ చేసిన సందీప్ అతని భార్య జ్యోతి సోషల్ మీడియాలో పాపులర్ డాన్స్ జోడి. వీరు చేసే డాన్స్ వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఈ మధ్యన సందీప్ అతని భార్య జ్యోతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆ ఇంటర్వ్యూలో జ్యోతి మాత్రం ఓం కార్ పేరు ఎత్తకుండా కడిగి పడేసింది. నా తమ్ముళ్లు నా తమ్ముళ్లు అంటూ ఆట షో లో చేసిన డాన్స్ మాస్టర్స్ ని చెప్పుకోవడం కాదు, మీరు చేసే పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు ఇప్పించాలి. మీరు చేసే సినిమాల్లో వేరే టాప్ కొరియోగ్రాఫర్స్ ని తెచ్చుకుంటారు. కానీ తమ్ముళ్లు అని చెప్పుకునే ఆట డాన్స్ మాస్టర్స్ కి ఛాన్స్ లు ఇవ్వరు. సందీప్ అంటే అతను సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అతన్ని పక్కనబెడితే ఆట షో చేసిన ఎవరికీ పేరు రాలేదు. వారికి సినిమాలు లేక, వేరే షోస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.. 

వాళ్ళు ఓ పొజిష‌న్‌కి వెళ్లి ప‌డిపోయారు. అలా ఎపుడైనా వారిని బ‌య‌ట చూసిన‌ప్పుడు చాలా బాధ‌గా ఉంటుంది. ఒక‌ప్పుడు వీళ్లంద‌రూ ఎంత మంచి డాన్సర్స్ అనిపిస్తుంది అంటూ జ్యోతి చేసిన వ్యాఖ్యలు అన్నీ ఓం కార్ ని ఉద్దేశించినవే అయినా.. ఆమె మాత్రం ఓం కార్ పేరు ఎక్కడా ఎత్తకుండా ఇండైరెక్ట్ గా కడిగిపారేసింది

Aata Sandeep wife Jyothi indirect comment on Omkar:

Choreographer Sandeep Wife Jyothi Raj Comments On Ohmkar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs