Advertisement
Google Ads BL

డైరెక్టర్స్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు


టాలీవుడ్ దర్శకులు చాలామంది బడ్జెట్ మీద ఫోకస్ పెడుతున్నారు కానీ, కథ మీద ఫోకస్ పెట్టకపోవడం వలన సినిమాలు ఫెయిల్యూర్ అవుతున్నాయనే కామెంట్స్ ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. కంటెంట్ మీద దృష్టి పెట్టాలి, మేకింగ్ బలంగా ఉండాలి.. అప్పుడే సినిమాలు సక్సెస్ అవుతాయి అనేది జగమెరిగిన సత్యం. అయితే తాజాగా ఇదే విషయంలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ డైరెక్టర్స్ పై ఓ ఈవెంట్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. చాలామంది డైరెక్టర్స్ సెట్స్ కి వచ్చిన తర్వాత డైలాగ్స్ రాస్తున్నారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా.. లేకపోతె నటనపై దృష్టి పెట్టాలా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Advertisement
CJ Advs

దర్శకులు అప్పటికప్పుడు ఇచ్చిన ఆ డైలాగ్స్ ని చదివి నటించాలంటే చాలామంది నటులు ఇబ్బంది పడుతున్నారు. అదే దర్శకులు ముందే స్క్రిప్ట్ లాక్ చేసి కథని, డైలాగ్స్ ని హీరోలకి, నటులకి ఇస్తే వారు ప్రాక్టీస్ చేసి.. సెట్స్ లో బెటర్ పెరఫార్మెన్స్ ఇస్తారు. నాకు కూడా ఇలాంటి ఎక్సపీరియెన్స్  జరిగింది. దర్శకులు ముందే ప్లాన్డ్ గా స్క్రిప్ట్ ని రెడీ చేసి పెట్టుకోవాలి, అప్పటికప్పుడు డైలాగ్స్ రెడీ చేస్తే కష్టం అంటూ చిరు డైరెక్టర్స్ పై కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అయితే చిరు ఎక్సపీరియెన్స్ చేసిన ఆ దర్శకుడు ఎవరా అని చాలామంది ఇప్పుడు చర్చలు మొదలు పెట్టేసారు.

Chiranjeevi sensational comments on Tollywood Directors:

Megastar Chiranjeevi Comments on Telugu Directors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs