ఈమధ్యన జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు.. జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోయినవాళ్లంతా వెనక్కి తిరిగిరావాల్సిందే.. సుధీర్, శ్రీను నాకు మాటిచ్చారు, జబర్దస్త్ ని వదలను అని, అంటూ సంచలనంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అప్పటినుండి సుధీర్, శ్రీను నిజంగానే జబర్దస్త్ కి వస్తారేమో అనే చర్చ జరుగుతుంది. శ్రీను సినిమా ఆఫర్స్ వలన జబర్దస్త్ వదిలెయ్యగా, సుధీర్ స్టార్ మా ప్రోగ్రామ్స్ కోసం, ఇతర ఛానల్స్ ప్రోగ్రామ్స్ కోసం ఈటీవికి బై బై చెప్పేసాడు. దానితో 3 మంకీస్ గా పేరు తెచ్చుకున్న రామ్ ప్రసాద్, సుధీర్, శ్రీనులలో వాళ్లిద్దరూ వెళ్లిపోగా రామ్ ప్రసాద్ ఒంటరిగా స్కిట్స్ చేస్తున్నాడు. ఇక ఏడు కొండలు వెళ్లిన వాళ్లంతా జబర్దస్త్ కి తిరిగిరావాల్సిందే అంటూ చెప్పాడు.
ఏడు కొండలు అన్నట్టుగానే.. గెటప్ శ్రీను జబర్దస్త్ కి వచ్చేసినట్లే కనిపిస్తుంది. వచ్చే శుక్రవారం ఎపిసోడ్ కి గెటప్ శ్రీను ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చూపించారు. రామ్ ప్రసాద్ తన టీం తో స్కిట్ మొదలు పెట్టగానే.. గెటప్ శ్రీను సర్ ప్రైజింగ్ గా రామ్ ప్రసాద్ వెనుకగా రాగానే రామ్ ప్రసాద్ ఆశ్చర్య పోయాడు. ఇంద్రజ అయితే ఎమోషనల్ అయ్యింది. ఇక మేడం కొద్దిగా టైం ఇస్తే.. నేను శ్రీను తో కలిసి స్కిట్ ప్రాక్టీస్ చేసి వస్తా అనగానే ఇంద్రజ వెళ్ళండి అంది. తర్వాత శ్రీను ఈజ్ బ్యాక్ అంటూ శ్రీను తన గెటప్ లోకి దూరిపోయి కామెడీ చెయ్యగా.. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గెటప్ శ్రీను ని ఇమిటేట్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీను వచ్చేసాడు, మరి సుధీర్ అన్న ఎప్పుడు వస్తాడని ఫాన్స్ అడుగుతుంటే, కొంతమంది శ్రీను కూడా జబర్దస్త్ ని వదల్లేదు, కొద్దిగా గ్యాప్ అని చెప్పడానికే వచ్చాడు, మళ్ళీ ఉండకపోవచ్చు అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది.